హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తకోట ఎస్సై బదిలీ

WNP: కొత్తకోట ఎస్సై శివానంద్ గౌడ్ బదిలీ అయినట్లు సమాచారం. ఆయన స్థానంలో మరికల్ ఎస్సై విక్రమ్ రానున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 9న బాధ్యతలు చేపట్టిన శివానంద్ గౌడ్ నాలుగు నెలలు పూర్తికాకముందే బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారిక బదిలీ ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఎస్సై విక్రమ్ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారు.