హైదరాబాద్: 28°C
వార్తలు

5న సీజేపీ కీలక సభ్యుల సమావేశం

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈనెల 5వ తేదీన జరగనుంది. శంభాజీనగర్‌లోని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నివాసమే ఇందుకు వేదిక కానుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని నూతన ఆలోచనలు, సలహాలతో రావాలని కీలక సభ్యులకు పార్టీ సూచించింది.