హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని వీధిస్తంభాలకు వీధిలైట్లను బిగిస్తున్నందున ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని విద్యుత్ అధికారులు తెలిపారు.