హైదరాబాద్: 28°C
వార్తలు

సికింద్రాబాద్‌లో నేడు 'రంగం' కార్యక్రమం

TG: ఆషాఢ బోనాల జాతరలో భాగంగా ఇవాళ ఉదయం 8:30 గంటలకు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నారు. మాతంగి పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తారు. వర్షాలు, పంటలు, ప్రజల శ్రేయస్సు, రాబోయే పరిస్థితులపై సూచనలు ఇస్తారని భక్తుల నమ్మకం. అనంతరం అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగిస్తూ 'సాగానంపే'తో లష్కర్ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.