హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల్లో మల్లారెడ్డి డ్యాన్స్ 

మెడ్చల్ బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సందడి చేశారు. కానుకల రథాల ఊరేగింపులో డప్పు వాయిస్తూ.. యువతతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఆయన పాల్గొనడంతో వేడుకల వాతావరణం మరింత జోష్‌గా మారింది. స్థానికులు, అభిమానులు మల్లారెడ్డితో కలిసి సంబరాల్లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.