హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి సందడి

RR: ఆషాఢ మాస బోనాల సందర్భంగా మన్సూరాబాద్‌లో కుమ్మర కులస్తులు నిర్వహించిన తొలి బోనం ఊరేగింపులో మాజీ మంత్రి మధు గౌడ్ యాక్షి పాల్గొన్నారు. పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మధు గౌడ్ యాక్షి పేర్కొన్నారు.