హైదరాబాద్: 28°C
వార్తలు

మైసమ్మ అమ్మవారికి బోనం సమర్పించిన కార్పొరేటర్

HYD: సీతాఫల్‌మండి కార్పొరేటర్ హేమ శ్యామల వారసిగూడ గంగపుత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని శ్రీ చిలకలగూడ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయంలో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.