హైదరాబాద్: 28°C
వార్తలు

ఛీ.. ఛీ.. అసలు నువ్వు తల్లివేనా?

హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్‌గూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజేశ్వరి అనే మహిళ తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువులో ముంచి ప్రాణం తీసింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.