హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ఫ్రెండ్ షిప్ డే వేడుకలు..

విజయనగరం శ్రీవాసవి డైమండ్ టీం ఆధ్వర్యంలో ఫ్రెండ్ షిప్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అధ్యక్షుడు వెత్స శ్రీనివాసరావు నేతృత్వంలో నిర్వహించిన ఆటపాటలు,లక్కీ డిప్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరికొకరు ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు తెలిపారు.