హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా ఆషాడ మాస బోనాలు

WGL: నర్సంపేటలోని శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో ఆషాడమాస బోనాల పండుగను నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో బోనాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి ధూపనైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. సకాలంలో వర్షాలు పడి రైతులకు అధిక దిగుబడి వచ్చి సిరిసంపదలతో కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండాలని వారు అమ్మవారిని వేడుతున్నారు. పూజారి శోభన్,భక్తులు పాల్గొన్నారు