హైదరాబాద్: 28°C
వార్తలు

కోట బీజేపీకి కొత్త అధ్యక్షుడు

TPT: జిల్లాలోని కోట మండల బీజేపీ అధ్యక్షుడిగా గునుపూడి హరిబాబును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణుల సహకారంతో కోట మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హరిబాబు పేర్కొన్నారు.