హైదరాబాద్: 28°C
వార్తలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ప్రకాశం: సీఎస్‌పురంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992–1997 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పూర్వ విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు పాల్గొని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.