పులి దాడిలో ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. కన్హా నేషనల్ పార్కు సమీపంలో పారాపూర్ బాగాటొలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో పులి వచ్చింది. మహిళ తలను నోట పట్టి ఏకంగా 300 మీ దూరం ఈడ్చుకెళ్లి వదిలేసింది. తలకు తీవ్ర గాయాలైన మహిళను బైహార్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆమె కన్నుమూసింది.
వార్తలు
మహిళను ఈడ్చుకెళ్లిన పులి


