హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు మరమ్మతులకు డిమాండ్

BHNG: మోత్కూర్ మండలంలోని ఎన్‌హెచ్-930పీ నుంచి సదర్శాపురం వెళ్లే రహదారిని బీజేపీ నాయకులు పరిశీలించారు. రహదారి దెబ్బతినడంతో ప్రజల ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన బీటీ రహదారి నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్‌ పాల్గొన్నారు.