WNP: గోపాల్‌పేట మండలం చెన్నూరులో ఆదివారం పెద్ద నాగన్నకు చెందిన బర్ల షెడ్డులో కరెంట్ షాక్‌తో రూ.1.30 లక్షల విలువైన బర్రె మృతి చెందింది. బర్రెల అరుపులు విని నాగన్న నిద్రలేచి చూడగా రెండు బర్రెలు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి మిగతా బర్రెలను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే ఒక బర్రె మృతి చెందినట్లు తెలిపారు.
వార్తలు
కరెంట్ షాక్‌తో బర్రె మృతి


