హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల ఉత్సవాల్లో సందడి చేసిన నేతలు

RR: ఫరూఖ్‌నగర్ మండలం భీమారం గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ గ్రామ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.