హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ పరిశోధన అవార్డు అందుకున్న NIT విద్యార్థిని

WGL: ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన పరిశోధకురాలు పాయల్ పి. ప్రధాన్‌కు భౌతిక శాస్త్ర విభాగంలో ఆదివారం ప్రతిష్ఠాత్మక కేవీఆర్ఎస్ఎస్ జాతీయ పరిశోధన పురస్కారం–2026 లభించింది. దేశవ్యాప్తంగా పరిశోధకులతో పోటీపడి రన్నరప్-2గా నిలిచిన ఆమెకు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పతకం, ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు ఆమెను అభినందించారు.