హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 15వ తేదీలోపు పంటల బీమా నమోదు

AKP: ఈనెల 15వ తేదీతో పంటల బీమా నమోదు గడువు ముగుస్తుందని మాకవరపాలెం మండల వ్యవసాయ అధికారి డి.అప్పారావు తెలిపారు. ఆదివారం బీమా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆయన, ప్రతి రైతు తప్పనిసరిగా పథకంలో చేరాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల నుంచి రక్షణకు బీమా ఎంతో ఉపయోగపడుతుందని, గడువు ముగిసేలోపు నమోదు పూర్తి చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.