హైదరాబాద్: 28°C
వార్తలు

నరేష్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NLG: తీవ్ర అనారోగ్యంతో నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునుగోడుకు చెందిన బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, 7వ వార్డు సభ్యులు రెవెళ్లి నరేష్‌ను మాజీ MLA ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అనంతరం నరేష్‌కు ధైర్యం చెబుతూ వ్యక్తిగతంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు.