KMR: రాజంపేట మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఆదివారం గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌తో మందు పిచికారీ చేపట్టారు. గ్రామంలోని వీధులు, కాలనీల్లో ప్రత్యేకంగా మందు చల్లి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమల వ్యాప్తి నివారణకు సహకరించాలని సూచించారు.
వార్తలు
సీజనల్ వ్యాధుల నివారణకు మందు పిచికారీ


