హైదరాబాద్: 28°C
వార్తలు

కోడుమూరులో ఎక్కడ చూసినా గుంతలే

KRNL: కోడుమూరులో చిన్న బోయ వీధికి వెళ్లే రహదారిపై హెచ్పీ గ్యాస్ కార్యాలయం ఎదురుగా పెద్ద గుంతలు తవ్వి వదిలేయడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారని, రాత్రి వేళల్లో వాహనదారులకు కూడా ముప్పు ఉందని తెలిపారు. వెంటనే గుంతలను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.