హైదరాబాద్: 28°C
వార్తలు

'నన్ను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు'

ప్రధాని మోదీపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన యువతి మరో వీడియో విడుదల చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పినా.. తనను అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ రేప్ చేస్తామని మెసేజ్‌లు పంపుతున్నారని, పోలీసులు సైతం.. తానేదో పెద్ద నేరం చేసినట్లు తన కోసం వెతుకుతున్నారన్న పేర్కొంది.