WNP: జిల్లా పశు సంవర్ధకశాఖలో 124 పోస్టులకు గాను 40 ఖాళీగా ఉండటంతో పశువైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. పశువులు, గొర్రెలు, మేకలకు సకాలంలో చికిత్సలు, టీకాలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొబైల్ పశువైద్య అంబులెన్స్ సేవలు కూడా సాయంత్రం 5 గంటల వరకే పరిమితం కావడంతో అత్యవసర సేవలు దెబ్బతింటున్నాయి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పాడి రైతులు కోరారు.
వార్తలు
'సిబ్బంది కొరత.. పాడి రైతులకు ఇబ్బందులు'


