ఢిల్లీ నిరసనల్లో ప్రధాని మోదీని దూషించిన బాలిక ఇటీవల క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆమెను క్షమిస్తున్నట్లు.. ప్రధాని కూడా వీడియో విడుదల చేశారు. తాజాగా దీనిపై బాలిక తల్లి స్పందిస్తూ.. 'ప్రధాని క్షమించడంతో నా కుమార్తెకు కొత్త జీవితం లభించింది. ఇవాళ నా కుమార్తె పుట్టినరోజు. ఆమెకు ప్రధాని అత్యంత గొప్ప కానుకగా కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈరోజు ఆమెకు పునర్జన్మ' అని అన్నారు.
వార్తలు
‘ప్రధాని నిర్ణయంతో నా కుమార్తెకు పునర్జన్మ’


