హైదరాబాద్: 28°C
వార్తలు

కాశీ విశ్వేశ్వరాలయంలో ఘనంగా రాహు-కేతు పూజలు

PLD: నరసింగపాడు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆదివారం రాహు-కేతు పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. అర్చకులు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ​ఆలయంలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక అర్చనలు చేశారు.