హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లపాడు రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

GNTR: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.