హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన MLA

MHBD: డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామ ఉపసర్పంచ్ రావుల రామకృష్ణ–మౌనిక దంపతుల కుమారుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాటోత్ రామచందర్ నాయక్ ఆదివారం ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలన్నారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.