హైదరాబాద్: 28°C
వార్తలు

'PGRS సేవలపై QR కోడ్‌తో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి'

PLD: PGRS సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను QR కోడ్ ద్వారా తెలియజేయాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. జిల్లా, మండల PGRS కేంద్రాల్లో QR కోడ్‌లను ఏర్పాటు చేసి, ఫిర్యాదు చేసిన వెంటనే స్కాన్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చన్నారు. ప్రతి సోమవారం జరిగే PGRSలో అర్జీలు సమర్పించి,సేవలపై స్పందన తెలియజేసి వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.