హైదరాబాద్: 28°C
వార్తలు

'రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాలు ప్రతీక'

TG: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పుష్కలంగా వర్షాలు కురవాలని పంటలు పాడిపంట చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని పేర్కొన్నారు.