హైదరాబాద్: 28°C
వార్తలు

వాసవి దేవాలయ పాలకవర్గ సమావేశం

SRD: సంగారెడ్డిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పాలకవర్గ సమావేశం ఆలయంలో ఇవాళ చైర్మన్‌తో పాటు అనంత కిషన్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 5వ తేదీన గణపతి హోమం ప్రారంభించి 151 రోజులు పూర్తవుతున్న సందర్భంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 7వ తేదీన అమ్మవారికి శాఖంబరి అలంకరణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.