విశాఖపట్నంలోని పాత గంగవరం బీచ్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెదజాలరిపేటకు చెందిన 19 ఏళ్ల యువతి స్నేహితులతో వెళ్లి ఫొటోలు దిగుతుండగా జారి సముద్రంలో కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు సముద్రంలోకి దిగిన రాము కూడా అలల్లో చిక్కుకుని గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
వార్తలు
గంగవరం బీచ్‌లో ఇద్దరు గల్లంతు


