హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మద్య నిషేధానికి గ్రామస్తుల తీర్మానం

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని గ్రామ మహిళలు స్వాగతించారు.