హైదరాబాద్: 28°C
వార్తలు

బీడు భూమిలా దర్శనమిస్తున్న పంట పొలాలు

SS: ధర్మవరం మండలం గొట్లూరు చెరువు వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో వాన జాడలేకుండా పోయింది. దీంతో గొట్లూరు చెరువులో నీరు తగ్గిపోతోంది. ఇప్పటికే 70శాతానికిపైగా నీరు ఇంకిపోవడంతో చెరువు ఒట్టిపోతోంది. హంద్రీనీవా నీరు రాకపోవడంతో ఆయకట్టులో వరి సాగుకు రైతులు వెనుకంజ వేశారు. గతేడాది పచ్చగా కళకళలాడిన ఈ ప్రాంతం, నేడు నీరు ఇంకిపోయి బీడు భూమిలా దర్శనమిస్తోంది.