హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రుద్రప్రయాగ్‌లో పోటెత్తిన వరద

ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. వరద కారణంగా నదులు, వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నదులు, వాగులకు దూరంగా ఉండాలని సూచించారు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.