బిహార్‌లో ఓ రైతు మొసలిని తాళ్లతో కట్టేసి భుజాలపై మోసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. అమిత్ కుమార్ తన పొలంలో మొసలి కనిపించడంతో అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు స్పందించకపోవడంతో, అతడే మొసలిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అనంతరం అటవీ శాఖ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకుని నదిలో వదిలేశారు.
వార్తలు
ఏకంగా మొసలినే మడతపెట్టేశాడు!


