తమిళనాడు చెన్నైలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.2.92 కోట్ల విలువైన 292 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ మత్తు పదార్థాన్ని శ్రీలంకకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
వార్తలు
చెన్నైలో భారీగా గంజాయి పట్టివేత


