AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట గోదావరి, వైనతేయ పాయలకు వరద నీరు భారీగా చేరుతోంది. చాకలిపాలెం సమీపంలో కనకాయలంక కాజ్ వే వరద నీటిలో మునిగింది. బూరుగులంక, అరిగెలవారిపేట, ఉడుముడి, జి.పెదపూడి లంక, ఆనగాల లంక, పెదమల లంక, అయోధ్య లంక, మర్రిమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వార్తలు
ఉధృతంగా గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట గోదావరి


