హైదరాబాద్: 28°C
వార్తలు

పూర్తికాని భవనం.. పెరుగుతున్న అవస్థలు

PPM: గరుగుబిల్లి మండలం ఖడ్గవలస ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ భవనం పునాదుల స్థాయిలోనే నిలిచిపోయింది. ఇనుప చువ్వలు తుప్పు పట్టి. పునాదుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం చిన్నారులు అద్దె గృహంలో ఇబ్బందులు పడుతున్నారు. భవనం పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. సమస్య పై ICDS CPDO సుగుణకుమారి భవనాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.