JN: లింగాలఘనపురం మండలంలోని కుందారం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉన్న అంబేడ్కర్ సామూహిక భవనం శిథిలావస్థకు చేరుకుంది. రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం శ్లాబ్ పెచ్చులూడి పడుతుండగా, పక్కనే కొత్త భవనం నిర్మించినప్పటికీ పాత భవనాన్ని తొలగించలేదు.పాఠశాల, అంగన్‌వాడీ చిన్నారులు సంచరించే ప్రాంతం కావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
వార్తలు
శిథిల భవనం.. చిన్నారులకు ముప్పు


