హైదరాబాద్: 28°C
వార్తలు

టౌన్షిప్‌లో నీటి సమస్యపై ఆందోళన

PLD: మాచర్ల శివారులోని MSR టౌన్షిప్‌లో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టౌన్‌షిప్‌లో నివసిస్తున్న వారు, యాజమాన్యం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచి పోయిందని నివాసితులు ఆరోపించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టౌన్షిప్‌లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.