హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రెండేళ్ల చిన్నారి

SDPT: సిద్దిపేటకు చెందిన అఖిల, వంశీధర్ దంపతుల రెండేళ్ల కుమారుడు అవ్యాన్స్ అసాధారణ ప్రతిభతో 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో నిలిచాడు. జాతీయ చిహ్నాలను గుర్తిస్తూ, క్లిష్టమైన పజిల్స్ పూర్తి చేసిన ఈ బాలుడు 'సూపర్ టాలెంటెడ్ కిడ్' బిరుదు పొందాడు. చిన్నారి అద్భుత ప్రతిభను మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.