హైదరాబాద్: 28°C
వార్తలు

PSలు వ్యాపార కూడళ్లుగా మారాయి: హైకోర్టు

శాంతిభద్రతల గురించి పట్టించుకోకుండా వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారంటూ యూపీ పోలీసుల తీరుపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. PSలు వ్యాపార కూడళ్లుగా మారిపోయాయంటూ మండిపడింది. ఈ మేరకు బలియా జిల్లాలోని రాస్రా PSలోని పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. 10 రోజుల్లో చర్యల నివేదికను అందించాలని తెలిపింది.