హైదరాబాద్: 28°C
వార్తలు

నక్కతోక వాగు ప్రవాహం తగ్గుముఖం..

MLG: వెంకటాపురం మండలం పాత్రపురం సమీపంలోని నక్కతోక వాగు వరద ప్రవాహం తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. రెండు రోజులుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించి రహదారిపై నీరు చేరడంతో అంతరాయం ఏర్పడగా, ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.