HNK: నడికూడ మండలం వరికోల్ గ్రామంలో దామిని-541 హైబ్రిడ్ మిర్చి విత్తనాల మొలక శాతంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం మొలక శాతం సంతృప్తికరంగా ఉందని గుర్తించి, నారు పెంపకంలో తగిన తేమను కొనసాగిస్తూ శాఖ సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.
వార్తలు
మిర్చి నారు పరిశీలించిన అధికారులు


