హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదావరి

TG: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. నిన్న 54 అడుగులకు పైగా వరద ప్రవాహం ఉండగా.. ఈ ఉదయానికి 52.9 అడుగులకు నీటి ప్రవాహం చేరింది. దీంతో భద్రాచలం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.