హైదరాబాద్: 28°C
వార్తలు

'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

PDPL: యువత మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనమవుతాయని, వాటికి దూరంగా ఉండాలని సుల్తానాబాద్ సీఐ పి. రంజిర్‌రావు తెలిపారు. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ శనివారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగం ఎన్టీపీఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.