హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: ఇవాళ కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కోనసీమ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.