హైదరాబాద్: 28°C
వార్తలు

చరిత్రలో ఈ స్నేహం ఎప్పటికీ ప్రత్యేకం

శ్రీకృష్ణుడు–కుచేలుడి స్నేహం నిజమైన స్నేహానికి శాశ్వత ఉదాహరణ. పేదరికంలో ఉన్న కుచేలుడు గుప్పెడు అటుకులతో ద్వారకకు వెళ్లినా, శ్రీకృష్ణుడు అతన్ని రాజులా ఆహ్వానించి అపారమైన ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడు. ఆ కౌగిలిలో సంపదకు విలువ లేదు.. స్వచ్ఛమైన స్నేహనికే స్థానం ఉంది. స్నేహంలో సంపద, హోదా కాదు.. ప్రేమ, విశ్వాసం, ఆప్యాయతే గొప్పవని ఈ స్నేహ బంధం ప్రపంచానికి చాటి చెప్పింది.