హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: పింగళి వెంకయ్య

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. దేశభక్తిని ఊపిరిగా భావించిన ఆయన.. భారత ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే త్రివర్ణ పతాక రూపకల్పనకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఎన్నో దేశాల జెండాలను అధ్యయనం చేసి.. భారత సంస్కృతి, స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా పతాకాన్ని రూపొందించారు. ఆయన త్యాగం, సేవ, సంకల్పం దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. నేడు పింగళి వెంకయ్య జయంతి.