హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్ బిల్లును ఓడించాలి: రాహుల్

నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఓడించాలని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. చెన్నై సమీపాన మామల్లపురంలో డీసీసీ అధ్యక్షుల వర్క్‌షాప్‌లో రాహుల్‌ పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి అధికారాన్ని హరించే కుట్రగా రాహుల్ అభివర్ణించారు.